చిరు కుటుంబంతో తగాదాలపై మరోసారి అల్లు అరవింద్‌ క్లారిటీ!

6 Oct, 2022 19:31 IST|Sakshi

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలు లేవంటూ సోషల్‌ మీడియాలో తరచూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అని అటు చిరంజీవి, ఇటు అల్లు అరవింద్‌ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లకు చెక్‌ పడటం లేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఎందుకిలా కాంట్రవర్సీలోకి లాగుతారు? మా కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.

ఇక తన మనవరాలు గురించి మాట్లాడుతూ.. 'అర్హ ఎంతో తెలివైనది. ఇంత చిన్న వయసులో అంత తెలివైనవాళ్లను చూడటం చాలా అరుదు. నా మనవరాలు కాబట్టి ఎక్కువ చెప్పుకోకూడదులే' అంటూనే అర్హపై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అరవింద్‌.

చదవండి: గరికపాటికి సారీ చెప్పిన చిరంజీవి
అమ్ము ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మరిన్ని వార్తలు