చిరంజీవితో బాలకృష్ణ మల్టీస్టారర్‌.. గూస్ బంప్స్ గ్యారంటీ!

4 Dec, 2022 16:43 IST|Sakshi

దశాబ్దాల నుండి..మాస్‌ను మంత్రముగ్డులను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి,నటసింహం నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే,ఉహిస్తేనే, గూస్ బంప్స్ గ్యారంటీ. ఇప్పుడు ఈ కల సాకారం కాబోతుందా.? ఆ తరంలో ఎన్టీఆర్, ఏన్నార్‌, కృష్ణ లాంటి స్టార్లు ఒకే స్క్రీన్ లో కనిపించి..అభిమానులను ఖుషీ చేశారు. ఇప్పుడు ఈ తరం హీరోలు నందమూరి నటసింహం, కొణెదెల హీరో కలిసి నటించబోతున్నారా ?ఈ బిగ్ ప్రాజెక్టుకు..అల్లు అరవింద్‌ స్కేచ్ వేస్తున్నాడా ?ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా ,ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చింది అంటారా ?

ఎన్టీఆర్ ,ఏన్నార్‌ ఓ తరం నటులు.ఫిల్మ్ ఇండిస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు.దశాబ్దాల పాటు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు.అలాంటి స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.తర్వాత వచ్చిన కృష్ణ,కృష్ణం రాజు,శోభన్ భాబు లాంటి హీరోలు కూడా ఒకే స్క్రీన్ మీద కనిపించి  అలరించిన వారే.ఇలాంటి సాలిడ్ మల్టీ స్టారర్లు చేసి వెండితెరను కళకళలాడేలా చేసారు

ఆ తరం తర్వాత..చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ తెలుగు వెండితెరకు నాలుగు స్థాంబాలుగా నిలిచారు.అయితే ఈ స్టార్లు..ఒకే స్క్రీన్ల మీద కనిపించింది మాత్రం లేదు.ఫ్యాన్స్ మధ్య పోటీ,వీళ్లను తెర మీద చూపించే కథ రాకపోవటం అలాగే..స్టార్ల మధ్య ఇగో ఫ్యాక్టర్లు లాంటివి కూడా..వీళ్లు కలిసి నటించకపోవటానికి కారణంగా నిలిచాయి.ఏమైతేనేం .వెండితెర మీద ఈ స్టార్ల మల్టీ స్టారర్ సినిమాలు చూసే భాగ్యం అభిమానులకు లేకుండా పోయింది.అయితే..ఇప్పుడు మాస్ గా బాప్ ..మెగాస్టర్ చిరంజీవి,నందమూరి నటసింహంల మల్టీ స్టారర్ తెర మీదికి వచ్చింది.ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు వేదికగా ఆహా ప్లాట్ ఫామ్ నిలిచింది

నందమూరి నటసింహం ఆహా ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న మ్యాటర్ తెలిసిందే.మొదటి సీజన్ హిట్ కొట్టింది.ఈ సెకండ్ సీజన్ కూడా బాగా అలరిస్తుంది. 90 సంవత్సరాల తెలుగు సినిమా సెలబ్రిషన్స్ సందర్బంగా..నిర్మాతలు..అల్లు అరవింద్,దగ్గుబాటి సురేష్ బాబు,దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును కలిపి బాలయ్య ఇంటర్వూ చేశాడు.

ఇంటర్వూలో  భాగంగా..అల్లు అరవింద్ తో ..మనిద్దరి కాంబినేషనే బ్యాలన్స్ అని బాలయ్య అడగగా,మీతో చిరంజీవి గారుతో కలిపి కాంబినేషన్ తీద్దామని వెయిట్ చేస్తున్నాను  అని అన్నాడు అల్లు అరవింద్. వెంటనే బాలకృష్ణ స్క్రిప్ట్‌ ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు. మా మల్టీస్టారర్ లో చిరంజీవికి పాటలు ఉండాలి. నాకు ఫైట్స్ ఉండాలి. ఇంట్రో సాంగ్ చిరంజీవిది, క్లైమాక్స్ ఫైట్ నాది అని బాలయ్య చెప్పుకొచ్చాడు. మరి అల్లు అరవింద్ ఆ మాటలు సీరియస్ గా అన్నాడా ? మరి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కాని..చిరు,బాలయ్య కలిసి మల్టీ స్టారర్ చేయటం అనే అలోచనే ..ఓ సెలబ్రిషన్‌ల ఉంది.మరి వీరిద్దరు కలిసి నటించి..వెండితెర సెలబ్రేషన్స్ చేయాలని అశిద్దాం.

మరిన్ని వార్తలు