Allu Aravind: కాంతారను చూసి బన్నీ వాసు పరుగెత్తుకుంటూ వచ్చాడు

19 Oct, 2022 16:50 IST|Sakshi

ఓటీటీల వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదు అనేదాంట్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించాయి పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, కార్తికేయ 2 సినిమాలు. కంటెంట్‌ ఉంటే చాలు కేవలం మౌత్‌ టాక్‌తోనే జనాలను థియేటర్స్‌కు రప్పించవచ్చని నిరూపించింది కాంతార. సెప్టెంబర్‌ 30న కన్నడలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా సూపర్‌ హిట్ అయింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో దీన్ని రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతున్న తరుణంలో బుధవారం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  

'సినిమాకు భాషా సరిహద్దులు లేవు, ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం రుజువు చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ. ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో  విష్ణు తత్వం, రౌద్ర రూపం చూశాక ఇది సింహాచలంకి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఇందులో హీరో ఎంత గొప్పగా చేశాడో మీరు చూశారు. అతను  ఫీల్ అయ్యి చేయడం వల్ల ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాధ్ అద్భుతమైన బాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఇచ్చారు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్‌ను రికార్డ్ చేసి మ్యూజిక్‌తో పాటు వదిలారు. 

ఈ సినిమాను కన్నడలో చూసిన బన్నీ వాసు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అన్నాడు. ఏంటి, బన్నీ వాసు ఇంత ఎగ్జైట్మెంట్‌గా చెబుతున్నాడు అనుకున్నాను.  సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యి దీన్ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించి తెలుగులో రిలీజ్ చేశాం. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టిని అడిగాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు' అని చెప్పాడు అల్లు అరవింద్‌.

చదవండి: సర్దార్‌లో అన్ని గెటప్సా? సూర్యను దాటేస్తాడా?
బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న కాంతా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు