Allu Arha Birthday Special: అల్లు అర్హకు తల్లి స్నేహా బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్‌.. వీడియో వైరల్‌

21 Nov, 2021 10:41 IST|Sakshi

Allu Arha Birthday Special Gift From Parents And Video Viral: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసేంది. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ఇక అల్లు అర్జున్‌ భార్య స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్‌, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అలాగే అల్లు అర్జున్‌ న్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్‌ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

ఇవాళ (నవంబర్‌ 21) అల్లు అర్జున్‌-స్నేహ దంపతుల ముద్దుల కూతురు అర్హ పుట్టినరోజు. నవంబర్ 21, 2016న పుట్టిన అర్హ నేడు ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో వసంతంలోకి అడుగుపెడుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను స్నేహ తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో అర్హ చెస్‌ గేమ్‌ ఆడుతూ సందడి చేస్తుంది. ఒక్కొక్క చేస్‌ గేమ్‌ బోర్డులో పావులు కదుపుతూ, కేరింతలు కొడుతూ, నవ్వుతూ చిందులేస్తు కనిపిస్తుంది. తన గేమ్‌ను అల్లు అర్జున్‌ కుటుంబం చప్పట్లు ఎంకరేజ్‌ చేస్తూ ఉంటుంది. అనంతరం తాను గెలుచుకున్న బహుమతులను చూపిస్తూ ఉంటుంది అర్హ. అర్హను, తాను ఆడే ఆట తీరును అల‍్లు అర్జున్‌, స్నేహ ప్రేమగా చూస్తూ ఆనందిస్తుంటారు. అల్లు అరవింద్‌ తన మనవరాలిని ముద్దు చేస్తూ కనిపిస్తారు. 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

చదవండి: ‘ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా..’ సాంగ్‌ రిలీజ్‌

మరిన్ని వార్తలు