చిరంజీవి బర్త్‌డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్‌ ఫ్యామిలీ

23 Aug, 2021 20:39 IST|Sakshi

రాఖీ పండగ, మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే రెండు పండగలు ఒకేరోజు రావడంతో మెగావారి ఇంట సంబరాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో అట్టహాసంగా సంబరాలు జరిగాయి. మెగా బ్రదర్స్‌, హీరోలు అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఇక మెగా ఆడపడుచులంతా చేరి మెగా బ్రదర్స్‌కు రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి చిరు బర్త్‌డేను సెలబ్రేట్‌ చేశారు.

చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్‌, మేకప్‌కు అంత సమయమా..!

ఈ వేడుకలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, మెగాస్టార్‌ కొడుకు-కోడలు రామ్‌ చరణ్‌, ఉపాసన కామినేని, కూతుళ్లు సుస్మిత, శ్రీజ వారి ఫ్యామిలీ, చిరంజీవి అక్కాచెల్లెలు, మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నిహారిక ఆమె భర్త హాజరయ్యారు. అలాగే అల్లు అరవింద్‌ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక బంధువులతో మెగా ఇళ్లంతా కళకళలాడింది. కానీ ఈ వేడుకలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కుటుంబం మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు ఆయన తమ్ముడు, హీరో అల్లు శిరీష్‌ కూడా హజరుకాలేదు.

చదవండి: నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు

మెగా ఫ్యామిలీలో అంత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్‌ గైర్హాజరుతో ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఎందుకు రాలేదా అని ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయినట్లు తెలుస్తోంది. అయితే అల్లు స్నేహారెడ్డి ఎందుకు రాలేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్‌ ఈ మెగా వేడుకలో లేకపోడం ఏదో వెలితిగా ఉందంటూ అభిమానులు స్పందిస్తున్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ను ఇలా మెగా కుటుంబంతో కలిసి చూసినందుకు ఆయన అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్‌ అనుమానాస్పద మృతి..

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు