బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

27 Aug, 2020 13:43 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. సంక్రాంతి కానుకగా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. పలు చోట్ల బాహుబ‌లి రికార్డులు కూడా తిరగరాసిన ఈ చిత్రం తాజాగా బుల్లితెర‌పై సునామి సృష్టించింది. ఇటీవల టీవీలో ప్రసారం అయిన ఈ సినిమా అత్యధికంగా 29.4 టీఆర్పీ రేటింగ్ సంపాదించి రికార్డు బ్రేక్‌ చేసింది. తెలుగులో ఇదే అత్య‌ధికం అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టాలీవుడ్‌లో అత్యధిక టీఆర్‌పీ మూవీగా 23.4 టిఆర్‌పిని సాధించింది. ఇక బుల్లితెరపై కూడా తమ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది.
(చదవండి : ఏంటి అన్న‌య్య‌.. ప్ర‌తిసారి కొత్త లుక్‌)

కాగా, ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. సినిమాలోని ప్రతి పాట ఓ సంచలనం. ఈ సినిమా మ్యూజిక్‌ ఆల్బమ్‌కి యూట్యూబ్‌లో వంద కోట్ల వ్యూస్‌ వచ్చాయి. తెలుగు సినిమా చరిత్రలో  ఒక సినిమా ఆల్బమ్‌కి ఈ స్థాయిలో ఆదరణ రావడం ఇదే తొలిసారి. సినిమా విడుదలై దాదాపు తొమ్మిది నెలలు కావొస్తున్న రికార్డుల హోరు మాత్రం తగ్గడం లేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు