బర్త్‌డే పార్టీలో అల్లు అర్జున్‌: లుక్‌ మామూలుగా లేదు..

16 Mar, 2021 10:03 IST|Sakshi

చావు కబురు చల్లగా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శరత్‌ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తళుక్కున మెరిశాడు. సోమవారం అతడి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు హాజరైన బన్నీ దగ్గరుండి కేక్‌ కట్‌ చేయించాడు. అనంతరం అతడికి ఆప్యాయంగా కేక్‌ తినిపించాడు. ఈ పార్టీలో నిర్మాత అల్లు అరవింద్‌, అల్లు శిరీష్‌ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతున్నాయి. ఇందులో బన్నీ లుక్‌ సరికొత్తగా ఉండటంతో 'అన్న మళ్లీ లుక్‌ మార్చాడురోయ్‌..' అంటూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

'స్టైల్‌ నీ డీఎన్‌ఏలోనే ఉంది', 'స్టైలిష్‌ స్టార్లు ఊరికే అయిపోరు మరి..' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా శరత్‌ చంద్ర.. బన్నీకి కుడి భుజంలా ఉంటూ అతడి వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇదే విషయాన్ని బన్నీ 'చావు కబురు చల్లగా' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లోనూ ప్రస్తావిస్తూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. తనకన్నీ శరతే అని, అతడు తన ఫ్యామిలీ మెంబర్‌ అని పేర్కొన్నాడు.

చదవండి: ఏం సక్కగున్నావ్‌రో.. అందరి కళ్లు బన్నీ పైనే!

అల్లు అర్జున్‌ను కలిసి ‘కేజీఎఫ్’‌ డైరెక్టర్‌.. ఫొటో వైరల్‌

మరిన్ని వార్తలు