నా మోరల్ సపోర్ట్ నువ్వే తమ్ముడూ.. బన్నీ ఎమోషనల్‌ ట్వీట్‌

30 May, 2021 14:36 IST|Sakshi

Allu Arjun : అల్లు వారి చిన్నబ్బాయి, హీరో అల్లు శిరీష్‌ పుట్టిన రోజు నేడు(మే 30). ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడూ.. నువ్ నా బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్.. రాబోయే రోజులు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.. తమ్ముడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసుకున్నారు.

ఇక తన అన్న అల్లు అర్జున్ చేసిన బర్త్‌డే ట్వీట్‌పై శిరీష్ స్పందిస్తూ.. థాంక్యూ AA(అల్లు అర్జున్).. మీలాంటి అన్నయ్య ముందు నేను ఎదగడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా ఫ్రెండ్.. నా గైడ్ మీరే’ అంటూ అల్లు శిరీష్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక పుట్టిన రోజు సందర్భంగా అల్లు శిరీష్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు.  ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘ప్రేమ కాదంట’టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు