'ఐకాన్‌' స్టార్‌ ప్రయోగం : అంధుడిగా అల్లు అర్జున్‌!

25 Jun, 2021 16:09 IST|Sakshi

అ‍ల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. రెండు భాగాలుగా వస్తోన్న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ ఆగస్టులో రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఇక పుష్ప షూటింగ్‌ అనంతరం అల్లు అర్జున్‌  వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్‌  సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కనుబడుట లేదు’ అనే ట్యాగ్ లైన్‌తో  తెరకెక్కబోతున్న ఈ మూవీలో బన్నీకి నిజంగానే కళ్లు కనిపించవట. అంధుడి పాత్రలో బన్నీ కనిపించనున్నట్లు ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. త్వరలోనే ఐకాన్‌ మూవీకి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం. గతంలో మాస్‌ మహారాజా రవితేజ కూడా ‘రాజా ది గ్రేట్’ సినిమాలో  అంధుడి పాత్రలో నటించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి బన్నీ చేయనున్న ఈ ప్రయోగంలో ఎంత వరకు సక్సెస్‌ అవుతారన్నది చూడాల్సి ఉంది. 

చదవండి : పది కేజీఎఫ్‌లు ఒక్క పుష్పతో సమానం: ఉప్పెన డైరెక్టర్‌
అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు