అల్లు అర్జున్‌తో సెల్ఫీ కోసం పోటీలు..

14 Sep, 2020 11:00 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : హీరో అల్లు అర్జున్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. సినిమా షూటింగ్‌లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నేరడిగొండ మండలం కుంటాల, మావల మండలం హరిత వనాన్ని ఆయన సందర్శించారు. ఇక ఆదివారం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అటవీ ప్రాంతానికి వెళుతుండగా జైనథ్‌ మండలం మాండగడ టోల్‌ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆయన వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. (పుష్ప ప్లాన్‌ మారింది)

కాగా  అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో తర్వాత పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లోకేషన్స్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు అందాల్ని చూడటానికి ఆయన వచ్చారు. ఆదిలాబాద్ సమీపంలోని మావల హరిత వనాన్ని సందర్శించి మొక్కని నాటారు.  తర్వాత మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అభయారణ్యం వెళ్లారు. బన్నీతో పాటు కుటుంబ సభ్యులు, ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. అల్లు అర్జున్ టీమ్‌తో అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నారు. (అదిరిపోయేలా ‘పుష్ఫ’ ఐటమ్‌ సాంగ్‌!)

 

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు