Allu Arjun: ఫెస్టివల్‌ మూడ్‌లో ఐకాన్ స్టార్‌.. ఎయిర్‌పోర్ట్‌ వీడియో వైరల్!

14 Jan, 2024 15:54 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు భోగి సంబురాలతో ఈ ఏడాది వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఫెస్టివల్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు. అగ్ర సినీ తారలంతా తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లిపోయి పొంగల్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫెస్టివల్‌ వెకేషన్‌కు వెళ్లిపోయారు. రామ్ చరణ్-ఉపాసన, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెళ్తూ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. 

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్నేహారెడ్డి సైతం బెంగళూరుకు వెళ్లిపోయారు. కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకల కోసమే బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ దంపతులు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్‌-1 సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప-2లో నటిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నటనకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. కాగా.. పుష్ప-2 చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 

>
మరిన్ని వార్తలు