Allu Arjun: రేంజ్‌ పెరిగిందని పుష్ప 2కి రేటు పెంచేశాడా?

28 Apr, 2022 15:02 IST|Sakshi

బాహుబలి, కేజీఎఫ్‌, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలు హిందీ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో రఫ్ఫాడించాయో మనందరికీ తెలుసు. ఒక్క హిందీలోనే వంద, రెండు వందల కోట్లను సైతం అవలీలగా రాబడుతూ హిందీ సినిమాలకే గట్టి పోటీనిస్తున్నాయి సౌత్‌ మూవీస్‌. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప 2 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌లో సౌత్‌ ఇండియన్‌ మూవీస్‌ హవా నడుస్తుండటంతో పుష్ప పార్ట్‌ 1 కంటే సెకండ్‌ పార్ట్‌ మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే 'పుష్ప: ది రూల్‌' సినిమా కోసం అల్లు అర్జున్‌ భారీ ఎత్తున పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా రూ.100 కోట్ల మేర రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. పుష్ప మొదటి భాగానికి రూ.50 కోట్లు తీసుకున్న ఐకాన్‌ స్టార్‌ సీక్వెల్‌కు రెట్టింపు డబ్బులు కోరడమేంటని ఫిల్మీదునియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కాగా పుష్ప 2 మూవీకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది.

చదవండి: 'నటుడిగా పనికిరావు, పోయి ఇంకేదైనా పని చూసుకో అని హేళన చేశారు'

'పోకిరి' ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన హీరోయిన్స్‌

మరిన్ని వార్తలు