మాల్దీవుల్లో అల్లు అర్జున్‌ కుటుంబం సందడి

4 Apr, 2021 13:46 IST|Sakshi

కాస్త సమయం దొరికితే చాలు సెలబ్రిటీలు మాల్దీవులు చెక్కేస్తుంటారు. సేద తీరాలన్నా, సెలబ్రేషన్స్‌ చేసుకోవాలన్నా.. దేనికైనా మాల్దీవులే బెస్ట్‌ చాయిస్‌ అంటుంటారు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కొడుకు అయాన్‌ పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ కోసం మాల్దీవులు వెళ్లాడు. కుటుంబం అంతటితో కలిసి జాలీగా గడిపాడు. బన్నీ భార్య స్నేహారెడ్డి సైతం అక్కడి  ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తోంది. ఈ మేరకు తన లేడీ గ్యాంగ్‌తో కలిసి దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. వీటికి సిస్టర్‌ స్క్వాడ్‌ అని క్యాప్షన్‌ జోడించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక బన్నీ చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు పుష్ప సినిమా చేస్తున్నాడు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నెల 7 సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌గా బన్నీని ప్రజలకు పరిచయం చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.

చదవండి: హ్యాపీ బర్త్‌డే మై బేబీ బాబు అయాన్‌: అర్జున్‌

'లోడు దింపతాండాం'.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండుగే‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు