అభిమాని కల నెరవేర్చిన అల్లు అర్జున్‌!

3 Oct, 2020 15:09 IST|Sakshi

సినిమా హీరోలకు, హీరోయిన్లకు చాలా మంది అభిమానులు ఉంటారు. అయితే వీరిలో కొం‍తమంది సినిమా రిలీజైన మొదటి రోజు సినిమాలు చూస్తూ, కట్‌ అవుట్‌లు పెట్టే వారుంటే మరికొంతమంది వారి కోసం ఏదైనా చేసే వీరాభిమానులు ఉంటారు. అలాంటి ఒక ఫ్యాన్స్‌ తన ఫేవరెట్‌ హీరో అల్లుఅర్జున్‌ కోసం ఏకంగా రెండు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ  వచ్చాడు. ఎన్నో​సార్లు కలవాలని ప్రయత్నిస్తున్న దక్కని అవకాశం ఈ సరైన దక్కుతుందా  అని ఆశపడిన అతని కల నెరవేరింది. ఎట్టకేలకు తన అభిమాన హీరోను కలుసుకొని ఫోటో దిగి మురిసిపోతున్నాడు  ఆ వీరాభిమాని. 

గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు వీరాభిమాని, దాంతో ఆయనను కలవడానికి నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించాడు. అయితే ఎన్ని సార్లు ప్రయత్నించిన బన్నిని కలవలేకపోయాడు. దీంతో ఆ వీరాభిమాని గత నెలలో ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు. ఎన్ని సార్లు ప్రయత్నించిన బన్నిని కలవలేకపోయానని, ఈసారి బన్ని కోసం పాదయాత్ర చేసుకుంటూ వస్తానని తెలిపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సెప్టెంబర్ 14న నడుచుకుంటూ హైదరాబాద్‌కు బయలుదేరిన నాగేశ్వరరావు‌ 22వ తేదీకి హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే అదే సమయంలో బన్ని తన కుటుంబంతో కలిసి గోవా టూర్‌కు వెళ్లారు. తన కోసం అంత దూరం నుంచి వచ్చిన అభిమానిని తన ఆఫీసులో కలిసి గంట సేపు  మాట్లాడాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సినిమాల విషయానికి వస్తే బన్ని ప్రస్తుతం సుకుమార్‌ డైరెక్షన్‌లో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్ని  కనిపించనున్నాడు. రష్మిక మందనా అల్లు అర్జున్‌ పక్కన హీరోయిన్‌గా కనిపించనుంది.   చదవండి: సందేశాత్మక చిత్రం.. బాగా నచ్చింది: బన్నీ

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు