పిల్లలతో సరదాగా.. అల్లు అర్జున్‌ క్యూట్‌ వీడియో

3 Jun, 2021 10:49 IST|Sakshi

అ‍ల్లు అర్జున్‌ ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారన్న విషయం తెలిసిందే. పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా ఏ అకేషన్‌ వచ్చినా షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చి మరీ కుటుంబంతోనే సరదాగా గడుపుతుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో షూటింగులకు కూడా బ్రేక్‌ పడినట్లయ్యింది. ఈ సమయాన్ని అల్లు అర్జున్‌ పూర్తిగా కుటుంబానికే కేటాయించారు. బుధవారం పిల్లలు అయాన్‌, అర్హలతో అ‍ల్లు అర్జున్‌​ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోను స్నేహ రెడ్డి తన ఫోన్‌లో బంధించింది.

ఆకాశంలోకి చూస్తూ బన్నీ పిల్లలకు ఏదో వివరిస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. ఇక ఈ వీడియోకు స్నేహ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇదిలా వుంటే ఐకాన్‌ స్టార్‌ బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్వకత్వంలో పుష్ప అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

చదవండి : బాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్న అల్లు అర్జున్‌
బన్నీకి నెగెటివ్‌.. పిల్లలతో కలిసి ఎమోషనల్‌ వీడియో

మరిన్ని వార్తలు