పెళ్లిపై అవగాహన కలిగించిన సినిమా ఇది

20 Oct, 2021 08:38 IST|Sakshi

‘‘అక్కినేని, అల్లు ఫ్యామిలీల జర్నీ 65ఏళ్లుగా సాగుతోంది. నాగార్జునగారితో నేను సినిమాలు నిర్మించా. మరో రెండు తరాలకు కూడా ఈ జర్నీ సాగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు అల్లు అరవింద్‌. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. 

ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్‌ మాట్లాడుతూ – ‘‘అఖిల్‌కి సక్సెస్‌ వచ్చినందుకు హ్యాపీ. తను డ్యాన్స్, ఫైట్స్‌ బాగా చేస్తాడు. కానీ వాటిని పక్కనపెట్టి ఓ మంచి సినిమా చేయాలని ఈ చిత్రం చేశాడు. ఆ చాయిస్‌ను గౌరవిస్తాను.  రీసెంట్‌గా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’తో, ఇప్పుడు ఈ సినిమాతో అఖిల్‌ హిట్‌ కొట్టారు. ఇద్దరు బ్రదర్స్‌ ఒకే సీజన్‌లో ఇంత పెద్ద హిట్స్‌ సాధించడం అనేది అనుకున్నా కూడా కుదరదు. అది ఎంతో సంతోషాన్నిచ్చింది. మా నాన్నగారు తన లైఫ్‌లో ఎప్పుడూ స్ట్రెస్‌ ఫీల్‌ కాలేదు. కానీ ఈ సినిమా జర్నీలో ఫీలయ్యారు. ఆయన అనుకుంటే ‘ఆహా’లో రిలీజ్‌ చేయవచ్చు. కానీ ఫైనాన్షియల్‌ స్ట్రెస్‌ తీసుకుని కూడా జనాలు థియేటర్స్‌కు రావాలని థియేటర్స్‌లో విడుదల చేశారు. నాన్నగారు ఎవరితో సినిమా చేస్తే వారి కెరీర్‌లో అది బెస్ట్‌ ఫిల్మ్‌. హిట్‌ కొట్టిన యూనిట్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘పెళ్లి చేసుకోవాలనుకునేవారు చూడాల్సిన సినిమా ఇది. భాస్కర్‌ అంత మంచి కథ రాశారు. పెళ్లిపై మంచి అవగాహన కలిగించిన సినిమా ఇది’’ అన్నారు.

అఖిల్‌ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘అల్లు అర్జున్‌గారు ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి మారిపోతారు. అల్లు అరవింద్‌గారితో పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. సందేశం ఇద్దామని కాకుండా ఈ కథ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం ఇద్దామని అనుకున్నాం. అవి వర్కౌట్‌ అయ్యాయనే భావిస్తున్నాను. హిట్‌ రూపంలో ప్రేక్షకులు ఓ గిఫ్ట్‌ ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ను ఎనర్జీగా తీసుకుని కెరీర్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. అక్కినేని ఫ్యాన్స్‌ నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోనని చెప్పాను. నాకు ఇంకా నిద్ర రాలేదు. సక్సెస్‌ వచ్చినందుకు అంత సంతోషంగా ఉంది’’ అన్నారు. 

వాసూవర్మ మాట్లాడుతూ – ‘‘ఆర్టిస్టుల నటన డైలాగ్స్‌ చెప్పడంలో ఉండదు. తోటి నటీనటుల డైలాగ్స్‌కు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌లో తెలుస్తుంది. అఖిల్‌ నటన, హావభావాలు బాగున్నాయి’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూస్తే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ మెరుగుపడుతుంది. అలాగే వారి మధ్య ఏదైనా సెలెన్స్‌ ఉంటే అది బ్రేక్‌ అవుతుందని    చెప్పగలను’’ అన్నారు.

‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ మాట్లాడుతూ – ‘‘తన సినిమా సక్సెస్‌ మీట్‌ జరగడాన్ని మించిన సంతోషం ఏదీ దర్శకుడికి ఉండదు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పూజ గ్లామరస్‌ స్టార్‌ అన్నారు. ఈ సినిమాతో పెర్ఫార్మింగ్‌ స్టార్‌ అంటున్నారు’’ అన్నారు పూజా హెగ్డే. వంశీ పైడిపల్లి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చదవండి: ‘అయ్యగారి ఫ్యాన్‌’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్‌

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు