Allu Arjun Wax Statue: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్‌, మహేశ్‌ తర్వాత బన్నీయే!

19 Sep, 2023 15:49 IST|Sakshi

మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగి ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తారు మన సినిమా వాళ్లు. ఒకప్పుడు ఇండియా నుంచి బాలీవుడ్‌ స్టార్స్‌కి మాత్రమే అక్క చోటు దక్కేది. కానీ ఈ మధ్య కాలంలో సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన హీరోలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్‌ ఇండియా స్థాయిలోనే కాదు వరల్డ్‌ వైడ్‌గా రాణిస్తోంది. దాని కారణంగానే మన వాళ్లకు ఆ మ్యూజియంలో అవకాశం దక్కుతోంది. ఇప్పటికే స్టార్‌ హీరోలు ప్రభాస్‌, మహేశ్‌ బాబు మైనపు విగ్రహాలు మేడమ్‌ టుస్సాడ్స్‌ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌కి చెందిన మరో స్టార్‌ హీరోకి అక్కడ చోటు లభించింది. అతనే జాతీయ అవార్డు గ్రహిత అల్లు అర్జున్‌. ఈ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. 

లండన్‌ వెళ్లనున్న బన్నీ
మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌కు చోటు దక్కిందనే వార్త గత కొన్నాళ్లుగా నెట్టింట వైరల్‌ అవుతోంది.  కొత్త విషయం ఏంటంటే.. త్వరలోనే బన్నీ లండన్‌ వెళ్లనున్నారట. మైనపు విగ్రహానికి సంబంధించి కొలతలు ఇవ్వడానికి బన్నీ  లండన్‌ వెళ్తున్నట్లు సమాచారం. . రెండు రోజులు అక్కడే ఉండి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని  తిరిగి ఇండియాకు వస్తారట. వచ్చే ఏడాదిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్‌ హీరోగా బన్నీ నిలుస్తాడు. 

పుష్ప-2పై భారీ అంచనాలు
పుష్ప చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న  ఏకైన హీరో అల్లు అర్జున్‌. ఈ అవార్డు ప్రకటనతో బన్నీ పాపులారిటీ మరింత పెరిగింది. అందుకే పుష్ప సీక్వెల్‌ పుష్ప-2(పుష్ప: ది రూల్‌)కి అంచనాలు మరింత పెరిగాయి.  సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

మరిన్ని వార్తలు