భార్య బర్త్‌డేకి స్పెషల్‌ విషెస్‌...గోల్డెన్‌ టెంపుల్‌కి బన్నీ ఫ్యామిలీ

29 Sep, 2022 16:38 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్‌ 29). ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ దర్శనానికి వెళ్లాడు బన్నీ. సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనం చేసుకున్నారు.  పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’
సోషల్‌ మీడియా ద్వారా భార్యకు బర్త్‌డే విషెస్‌ చెప్పాడు బన్ని. స్నేహారెడ్డి కెక్‌ కట్‌ చేస్తున్న ఫోటోని తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ‘హ్యాపీ బర్త్‌డే క్యూటీ’అని పోస్ట్‌ చేశాడు.  అల్లు అర్జున్‌, స్నేహారెడ్డిలది ప్రేమ వివాహం. 2011 మార్చ్ లో వీరి పెళ్లి జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు.

మరిన్ని వార్తలు