'తగ్గేదే లే'.. అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డు

26 May, 2021 15:43 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పికప్పుడు అప్‌డేట్స్‌ను షేర్‌ చేస్తూ ష్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్‌ ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు బన్నీ. కొద్ది రోజుల కిందటే విజయ్‌ దేవరకొండ ఈ ఫీట్‌ను అందుకోగా, ఆ తర్వాతి స్థానంలో బన్నీ ఉన్నాడు. మిగతా స్టార్స్‌  మహేష్ బాబు (6.8), ప్రభాస్ (6.5), రామ్ చరణ్ (3.9), ఎన్టీఆర్ (2.6), ‍మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా వీళ్లందరిని వెనక్కి నెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు బన్నీ. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు.దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఫిల్మ్‌లో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు.

 చదవండి :Pushpa Movie: రెమ్యునరేషన్‌ భారీగా పెంచిన బన్నీ, ఎంతంటే..
త్వరలోనే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్‌ ఎంట్రీ!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు