తగ్గేదే లే అంటూ సందడి

23 Aug, 2022 04:43 IST|Sakshi

భారత స్వాతంత్య్ర దినోత్సవం     సందర్భంగా అమెరికాలో జరిగిన     ‘ఇండియా డే పరేడ్‌ న్యూయార్క్‌ 2022’ వేడుకలకు ఈ ఏడాది గ్రాండ్‌ మార్షల్‌ హోదాలో అల్లు అర్జున్‌ ప్రాతినిధ్యం        వహించారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌ మేయర్‌ ఎడిక్‌ ఆడమ్స్‌ అల్లు అర్జున్‌ను సన్మా నించారు. ‘పుష్ప’లోని ‘తగ్గేదే లే’ సిగ్నేచర్‌ మూమెంట్‌తో        సందడి చేశారు అల్లు అర్జున్‌. ఈ వేడుకలో అల్లు అర్జున్‌ భార్య  స్నేహా పాల్గొన్నారు.  

పుష్పరాజ్‌ రూల్‌ స్టార్ట్‌
అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ మంచి హిట్‌ అయింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్‌’ఆరంభమైంది. తొలి షాట్‌కి మారిశెట్టి ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, శ్రీమాన్‌ క్లాప్‌ కొట్టారు. తోట శ్రీనివాస్‌ గౌరవ దర్శకత్వం వహించారు. వీరు ముగ్గురూ సుకుమార్‌ అసోసియేట్‌ డైరెక్టర్లు కావడం విశేషం. రష్మికా
మందన్నా ఇందులోనూ నటిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. త్వరలో రెగ్యులర్‌
 షూటింగ్‌ ఆరంభం కానుంది.
∙చెర్రీ , రవిశంకర్, సుకుమార్, తబిత, వెంకట్‌ కిలారు, విజయ్‌

మరిన్ని వార్తలు