Tollywood: అగ్ర హీరోలతో దిల్‌ రాజు కీలక భేటీ, దిగొచ్చిన బన్నీ, తారక్‌, చరణ్‌

27 Jul, 2022 15:35 IST|Sakshi

టాలీవుడ్‌ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో బడ్జెట్‌ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్‌, టికెట్‌ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్‌ గిల్డ్‌ సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్‌ వ్యయం, హీరోల రెమ్యునరేషన్‌ అంశాలు  ఓ కొలిక్కి వచ్చేంత వరకు తాత్కాలికంగా షూటింగ్‌ నిలివేస్తున్నట్లు నిన్న నిర్మాతల గిల్డ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

చదవండి: Tollywood: టాలీవుడ్‌ నిర్మాతల సంచలన నిర్ణయం, కొత్త నిబంధనలివే!

దీంతో షూటింగ్‌ దశలో ఉన్న పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్‌ నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు రంగంలోకి దిగాడు. ఇదే ఇదే అంశంపై పలువురు టాలీవుడ్‌ అగ్ర హీరోలతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. నీ సందర్భంగా స్టార్‌ హీరోలైన జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌తో పాటు పలువురు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకుంటామని దిల్‌ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో కూడా ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యుసర్స్‌ గిల్డ్‌ తెలిపింది. షూటింగ్‌ సంక్షోభంపై నిర్మాతల గిల్డ్‌కు చిరంజీవి లేఖ రాసినట్లు సమాచారం అందింది.  ఇక దీనిపై ఈ రోజు మధ్యాహ్నం నిర్మాతలు భేటీకి సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. 

చదవండి: ఫ్యాన్స్‌కి షాక్‌.. ఏడాదికే బ్రేకప్‌ చెప్పుకున్న ‘బిగ్‌బాస్‌’ జోడీ

మరిన్ని వార్తలు