స్టైలీష్‌ స్టార్‌ పిల్లలా.. మజకా..!

24 Oct, 2020 14:47 IST|Sakshi

కరోనా వ్యాప్తి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా స్టార్లకు కావాల్సినంత బ్రేక్‌ దొరికింది. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉండే వాళ్లంతా గత ఏడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఎంజాయ్‌ చేస్తున్నారు. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఇదే పనిలో ఉన్నార. బన్నీకి ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం దొరికిన ఈ బ్రేక్‌ని పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తూ సరదగా గడుపుతున్నారు. పిల్లల అల్లరికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పొస్ట్‌ చేస్తుంటారు. తాజాగా తన పిల్లల డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేశారు బన్నీ. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: 6 నిమిషాలకు 6 కోట్లు)

Having a great Friday Night dance party #pennywisedance 😂 #mylovelybabies 🖤

A post shared by Allu Arjun (@alluarjunonline) on

‘ఫైడే నైట్‌ డ్యాన్స్‌ పార్టీ’ పేరుతో షేర్‌ చేసిన ఈ వీడియోలో అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌, అతని కజిన్‌ హాలీవుడ్‌ మూవీ ఐటీలోని పెన్నీవైస్‌ను అనుకరిస్తూ.. తనలాగా​ డ్యాన్స్‌ చేయడం ప్రారంభిస్తారు. కాసేపటికి అర్హా కూడా అన్నతో కలిసి డ్యాన్స్‌ చేస్తుంది. పిల్లల అల్లరి‌ చూసి బన్నీ నవ్వుతూ తెగ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు ‘ఎంత క్యూట్‌గా డ్యాన్స్‌ చేశారో’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ, సుకుమార్‌ రూపొందిస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు.  మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు