అల్లు అర్జున్‌ కొత్త బిజినెస్‌: మహేష్‌కు పోటీగా!

24 Mar, 2021 15:52 IST|Sakshi

సినిమాలతోపాటు ఇతర బిజినెస్‌లపై దృష్టిపెట్టారు మన టాలీవుడ్‌ హీరోలు.. కొత్త రంగాల్లో పెట్టిబడి పెడుతూ చేతికి అందినంత సంపాదించుకునేదుకు సిద్దపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. స్టార్ హీరోగా దూసుకుపోతున్న బన్నీ ఇప్పుడు థియేటర్ల రంగంలోకి ఎంటర్‌ అయ్యాడు.

ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఏఏ(AAA) సినిమాస్ మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ వ్యాపారంలో మహేశ్‌‌బాబు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ(AMB) సినిమాస్‌ పేరుతో మహేష్‌ బిజినెస్‌ చేస్తున్నాడు. అలాగే హీరో విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ పార్ట్‌నర్ షిప్‌తో మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నాడు. ఏవీడీ(AVD) సినిమాస్ పేరుతో తన సొంత పట్టణం మహబూబ్‌నగర్‌లో మొదలు పెడుతున్నాడు. ప్రస్తుతం బన్నీ కూడా థియేటర్ల బిజినెస్‌లోకి రావడంతో వీరిద్దరి మధ్య మంచి పోటీ నెలకొనబోతోందని టాక్‌ వినిపిస్తోంది.

సినిమా ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మల్టిప్లెక్స్ నిర్మాణంలో ఉంది. అమీర్ పేట్ సత్యం థియేటర్ స్థలంలోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇక అల్లు అర్జున్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఏఏఏ సినిమాస్‌ నిర్మాణం జరుగుతోంది. అమీర్‌పేట్‌ పరిసరాల్లోనే అత్యంత విలాసవంతమైన భవంతిగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

దీని కోసం భారీగానే డబ్బులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాతి వరకు ఈ థియేటర్‌ రెడీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ ఫోటోతో ఏఏఏ లోగో కూడా విడుదల చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ రేంజ్ మించిపోయేలా ఏఏఏ సినిమాస్ ఉంటుదా అనేది తెలియాలంటే నిర్మాణ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

చదవండి: 
పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు‌

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు