Pushpa In Russia: రష్యా వెళ్లనున్న అల్లు అర్జున్.. ఆ సినిమా కోసమే..!

26 Nov, 2022 16:10 IST|Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు హిందీలోనూ సత్తా చాటింది.  ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది.

(చదవండి: పుష్ప 2 నుంచి కొత్త అప్‌డేట్‌! లేడీ విలన్‌గా ఆ హీరోయిన్‌?)

అయితే తాజాగా పుష్ప పార్ట్-1 సినిమాను రష్యాలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. డిసెంబర్‌లో రిలీజ్ చేయనుండగా.. ప్రమోషన్ల కోసం బన్నీ రష్యా బయలు దేరనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో బన్నీ నటనకు రష్యా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారోనని చూసేందుకు అల్లు అర్జున్ వెళ్తున్నట్లు తెలుస్తోంది.  

మరోవైపు పుష్ప-2: ది రూల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు బన్నీ. పుష్ప సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనూ ఫాహద్‌ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  

మరిన్ని వార్తలు