ఆ స్టార్‌ డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌ నెక్ట్స్‌ మూవీ

5 Apr, 2021 15:31 IST|Sakshi

'సరిలేరు నీకెవ్వరు', 'ఎఫ్‌ 2' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో మంచి ఫామ్‌మీదున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు తీస్తూ హిట్‌ డైరెక్టర్‌ అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్‌​3 సినిమాను తెరకక్కిస్తున్నారు. ఇంతకుముందు హిట్ కొట్టిన 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో కలిసి ఓ సినిమాలో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలో అల్లు అర్జున్‌కు ఓ కథ వినిపించగా, ఆయన వెంటనే గ్రీన్‌ సిగ్నాల్‌ ఇచ్చాడని సమాచారం. గతంలో అనిల్‌తో వర్క్‌ చేయడానికి బన్నీ సముఖంగా లేరని రూమర్స్‌ వినిపించాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి మూవీ రానుందనే ఆసక్తి నెలకొంది. 

ప్రస్తుతం అల్లు అర్జున్‌ 'పుష్ప' అనే పాన్‌ఇండియా సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ అనంతరం అనిల్‌ రావిపూడితో కలిసి సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది. మరోవైపు  ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌ తర్వాత మహేష్‌బాబుతో కలిసి అనిల్‌ రావిపూడి మరో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్‌ సూపర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. 

చదవండి : ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌!
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..‘పుష్ప’ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు