కృష్ణం రాజు పార్థివ దేహనికి అల్లు అర్జున్‌ నివాళులు

11 Sep, 2022 20:49 IST|Sakshi

సీనియర్‌ నటుడు కృష్ణంరాజు(83) పార్ధివ దేహ‌నికి అల్లు అర్జున్‌ నివాళులర్పించారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే బెంగళూరి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్న బన్ని.. నేరుగా కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహనికి నివాళులర్పించారు. అనంతరం ప్రభాస్‌ దగ్గరకెళ్లి ఓదార్చాడు. 

త‌ద‌నంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ’ అన్నారు

మరిన్ని వార్తలు