Allu Arjun Fans: ఫ్యాన్స్ దెబ్బకు ఫోటో షూట్ రద్దు.. అట్లుంటది మనతోని..!

6 Feb, 2023 21:29 IST|Sakshi

ఐకాన్ స్టార్ బన్నీ అంటే రచ్చ మామూలుగా ఉండదు. ఆయన ఎంట్రీ ఇచ్చాడంటే అక్కడ ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా అల్లు అ‍ర్జున్ ఫ్యాన్స్ వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఫోటో షూట్‌లో బన్నీ పాల్గొన్నారు. అయితే అభిమానులు అత్యుత్సాహానికి ఏకంగా ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. ఫ్యాన్స్ దెబ్బకు ఫోటో షూట్ రద్దయినట్లు తెలుస్తోంది.

దీంతో ఎంతో ఆశగా బన్నీ అన్నను చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు. కొందరేమో ఏకంగా వేదికపైనే బోరున విలపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. బన్నీ చూసేందుకు వచ్చిన వేలాది మంది ఆయన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. ‍అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు