‘పుష్ప’ సెన్సార్ పూర్తి.. ఇక తగ్గేదేలే

10 Dec, 2021 23:31 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ చిత్రం ప్యాన్‌ ఇండియా సినిమాగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక దాంతో ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. ఇక ‘పుష్ప’ ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12న హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తాజాగా విడుదలైన సమంత ఐటం సాంగ్‌ తన అభిమానులను అలరిస్తుంది.

మరిన్ని వార్తలు