Pushpa: పుష్ప పార్ట్‌ 1 రిలీజయ్యేది అప్పుడే!

3 Aug, 2021 13:06 IST|Sakshi

Pushpa Release Date: అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం "పుష్ప". అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఎర్ర చందనం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ రష్మిక మందన్నా పల్లెటూరి పడుచుపిల్లగా నటిస్తుండగా, ఫహద్ ఫజల్ విలన్‌గా కనిపించనున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.

ఈ ఏడాది క్రిస్‌మస్‌ పండగకు పుష్పను రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. నిజానికి ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కరోనా వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమవడంతో కొత్త రిలీజ్‌ డేట్‌ వెతుక్కోక తప్పలేదు. సోషల్‌ మీడియాలో వినిపించిన ఊహాగానాలనే నిజం చేస్తూ డిసెంబర్‌లోనే రిలీజ్‌కు రెడీ అయింది పుష్ప. మొత్తానికి ఇది అధికారిక ప్రకటన కావడంతో బన్నీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు