తాతయ్య వర్ధంతిని గుర్తు చేసుకున్న బన్నీ

31 Jul, 2020 10:32 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వుల పూలు పూయించిన వ్యక్తి అల్లు రామలింగయ్య. తెలుగు వారి జివితాల్లో అల్లుకున్న అల్లు రామలింగయ్య వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన వారసుడు అల్లు అర్జున్‌ తాతయ్యను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘తాత మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు. జీవితంలో చాలా విషయాలు నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కృషి, పట్టుదల, పోరాటాలకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం’. అంటూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి)

కాగా అల్లు రామలింగయ్య 1922 అక్టోబరు 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. తండ్రి వెంకయ్యకి ఏడుగురు సంతానం. వారిలో రామలింగయ్య నాలుగవ సంతానం. రామలింగయ్యకు సోదరి సత్యవతి. స్వతహాగా నాటక కళాకారుడైన అల్లు రామలింగయ్య ఊర్లు తిరుగుతూ నాటకాలు ప్రదర్శింస్తుండేవారు. ‘పుట్టిల్లు’ సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమైన రామలింగయ్య వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. (బన్నీని ఒక్క ఛాన్స్‌ అడిగిన బాలీవుడ్‌ డైరెక్టర్‌)

తన అద్భుత నటనతో హాస్యపు జల్లునే కాదు కామెడీ విలనిజాన్ని కూడా రక్తి కట్టించి తెలుగు వారి మనసుల్లో సుస్తిర స్థానాన్ని నిలుపుకున్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు తన నటనతో కితకితలు పెట్టించి నవ్వించిన రామలింగయ్య 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. తెలుగు సినిమా వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఓ తపాలా బిళ్లను విడుదల చేశారు.  అల్లు నటించిన చివరి సినిమా జై.  2004 జూలై 31న అల్లు రామలింగయ్య కన్నుమూశారు.

మరిన్ని వార్తలు