ఈ మధ్య కాలంలో ఇంత ఎప్పుడూ నవ్వలేదు : అల్లు అర్జున్‌

12 Mar, 2021 11:55 IST|Sakshi

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్‌ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ ఈ సినిమాపై స్పందించారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ ఎప్పుడూ నవ్వలేదంటూ చిత్ర యూనిట్‌పై  ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన వాళ్లలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

'నిన్న రాత్రి జాతిరత్నాలు చూశాను. నవీన్‌ పొలిశెట్టి అద్భుతంగా నటించాడు. అప్‌కమింగ్‌ హీరోగా నవీన్‌ నటన ఆకట్టుకుంది. రాహుల్‌  చాలా సునాయాసంగా నటించాడు. ప్రియదర్శి, ఫరియా నటన ఎంతో ప్రశంసనీయంగా ఉంది. ఈ సినిమాను నిర్మించిన నాగ్‌ అశ్విన్‌, స్వప్నా దత్‌, ప్రియాంక దత్‌లకు అభినందనలు, రథన్‌ అందించిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లందరికి నా అభినందనలు. ఇక చివరగా డైరెక్టర్‌ అనుదీప్‌కి మా అందరిని ఇంత బాగా నవ్వించినందుకు స్పెషల్‌ థ్యాంక్స్‌. మైండ్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకొని అందరూ  సినిమాను చూసి ఎంజాయ్‌ ‌ చేయండి' అంటూ ట్వీట్‌ చేశారు. నిన్న (మార్చి11)న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక‌్షన్లను రాబడుతోంది. చదవండి :  (‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ)

మరిన్ని వార్తలు