Allu Arjun-Arha Viral Video: 'ఆ ఇద్దరి మధ్య బంధం అంటే ఇదే'.. అల్లు అర్జున్‌ ఎమోషనల్!!

24 Sep, 2023 20:52 IST|Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇటీవలే జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమాలో బన్నీ నటనకు గానూ ఆయనకు ఈ అవార్డ్ లభించింది. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో పుష్ప-2 రాబోతోంది. ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ. అయితే తాజాగా ఇవాళ అంతర్జాతీయ కూతుర్ల దినోత్సవం సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. తన ముద్దుల కూతురు అల్లు అర్హతో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు.

(ఇది చదవండి: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్‌, మహేశ్‌ తర్వాత బన్నీయే!)

వీడియోలో బన్నీ మాట్లాడుతూ.. 'ఎందుకు నువ్వు ఇంత క్యూట్‌గా ఉన్నావు.. కొంచెం క్యూట్ అయితే ఓకే.. మరీ ఇంత క్యూట్‌గా ఎలా ఉన్నావ్' అంటూ తనపై కూర్చోపెట్టుకుని కుమార్తెను ముద్దాడారు. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నువ్వంటే నా ప్రాణం' అంటూ అల్లు అర్హపై ఒక తండ్రిగా ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సైతం అల్లు అర్హ సో క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. అల్లు అర్జున్, రష్మిక నటిస్తోన్న పుష్ప-2 వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. 

బన్నీ కూతురు అల్లు అర్హ సైతం శాకుంతలం సినిమాత వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారంలోనూ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

A post shared by Allu Arjun (@alluarjunonline)

మరిన్ని వార్తలు