అప్పుడే పదేళ్లు.. తాజ్‌మహల్‌ వద్ద బన్నీ, స్నేహ హల్‌చల్‌

6 Mar, 2021 14:31 IST|Sakshi

ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ఆగ్రా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు నేడు(శనివారం) 10వ వెడ్డింగ్‌ యానివర్సిరీని జరుపుకుంటున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ రోజుతో వీరి వివాహ బంధానికి పది సంవత్సరాలు.టాలీవుడ్‌ స్టార్‌ హీరోగా అల్లుఅర్జున్‌ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఏం మాత్రం టైం దొరికినా కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పులకు వెళ్తుంటారు.

శనివారం (నేడు) పదవ వార్షికోత్సవం సందర్భంగా అల్లుఅర్జున్‌ భార్య స్నేహతో కలిసి ప్రేమసౌధం తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..ఈ పదేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయని, ఇంకెన్నో యానివర్సిరీలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.


ఈ సందర్భంగా స్టార్‌ కపుల్‌ అల్లుఅర్జున్‌- స్నేహ రెడ్డి దంపతులకు  అటు టాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానుల  నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అల్లు అర్జున్‌, స్నేహాకు 2014లో అయాన్‌, 2016లో అర్హ జన్మించారు. ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్‌ 13న విడుదల కానుంది.

చదవండి :

శర్వానంద్‌కి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మెగా హీరో..

తాప్సీని మరోసారి టార్గెట్‌ చేసిన కంగనా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు