హ్యాపీ బర్త్‌డే మై బేబీ బాబు అయాన్‌: అర్జున్‌

3 Apr, 2021 15:42 IST|Sakshi

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముద్దుల తనయుడు అల్లు అయాన్‌ నేడు 6వ పుట్టిన రోజును జరపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అయాన్‌కు సినీ ప్రముఖులు, అల్లు అభిమానుల నుంచి సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇక తండ్రి అల్లు అర్జున్‌ తనయుడికి ట్విటర్‌ వేదికగా స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపాడు. 

బన్నీ ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘మేనీ మేనీ హ్యీపీ రీటర్స్‌ ఆఫ్‌ ది డే మై స్వీట్‌ బేబీ బాబు ఆయాన్‌. నీకు ఇంకా ఎన్నో అందమైన సంవత్సరాలు రావాలని  కోరుకుంటున్నాను. లవ్‌ యూ నాన్న’ అంటూ బన్నీ ట్వీట్‌ చేశాడు. అలాగే బాబాయ్‌ అల్లు శిరీష్‌ కూడా అయాన్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక డైరెక్టర్‌ హరీష్‌‌ శంకర్‌ అయాన్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల కేరళ అడవుల్లో షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్‌ను జరుపుకుంటోంది.

చదవండి: 
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..‘పుష్ప’ నుంచి క్రేజీ అప్‌డేట్‌ 

భార్య, కూతురు ఫొటో షేర్‌ చేసిన బన్నీ

మరిన్ని వార్తలు