‘బుట్టబొమ్మ’ సంచనలం.. తొలి రికార్డు అందుకున్న బన్నీ..

3 May, 2021 17:27 IST|Sakshi

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. గతేడాది సంక్రాంతికి రిలీజ్‌ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ  చిత్రం దాదాపు 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. బన్నీ కెరీర్‌లోనే దిబెస్ట్‌ మూవీగా నిలిచింది. ఇక సినిమాకు తమన్‌ సంగీతం అందించిన పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఒక్కో సాంగ్‌ ఒక్కో రికార్డును సాధించింది.

ఇక రామజోగయ్యశాస్త్రి రాసిన 'బుట్టబొమ్మ' సాంగ్ సూపర్ పాపులర్ అయ్యింది. ఎవరి నోట విన్న ఇదే పాట కనిపించింది. టిక్ టాక్, డబ్ స్మాష్ ఇలా ప్రతిచోటా బుట్టబొమ్మే దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ పాట మరో సంచలన రికార్డు అందుకుంది. యూట్యూబ్‌లో సెన్సేషనల్ హిట్టై ఏకంగా 600 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆగస్ట్ 1న 300 మిలియన్ క్లబ్బులోకి అడుగు పెట్టిన బుట్టబొమ్మ.. అక్టోబర్‌లో మరో 100 మిలియన్స్ అందుకొని 400 మిలియన్లు చేరుకుంది. జనవరిలో 500 మిలియన్లకు చేరుకుంటే.. తాజాగా ఈ సాంగ్‌ 600 మిలియన్స్‌ దాటింది. తెలుగులో ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు పాటగా రికార్డు క్రియేట్ చేసింది.

చదవండి: నేను బాగున్నాను.. కోలుకుంటున్నాను: అల్లు అర్జున్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు