ఈ రోజు కోసమే ఎదురు చూశాను : అల్లు అర్జున్‌

7 Nov, 2022 05:18 IST|Sakshi
రాకేష్‌ శశి, అల్లు అరవింద్, అనూ ఇమ్మాన్యుయేల్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, ధీరజ్, బన్నీ వాస్‌

– అల్లు అర్జున్‌

‘‘నా సినిమా హిట్‌ అయినా కూడా నేను ఇంత ఆనందంగా ఉండను.. నా తమ్ముడు శిరీష్‌ ‘ఊర్వశివో రాక్షసివో’ తో హిట్‌ కొట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది.. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేష్‌ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలయింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఊర్వశివో రాక్షసివో బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌’ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్‌ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఈ సినిమా మా గీతా ఆర్ట్స్‌కి, మా నాన్న–అమ్మలకు, నాకు, శిరీష్‌కి చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. ఇకపై ఈ బ్యానర్‌లో ఎన్ని హిట్స్‌ వచ్చినా ‘ఊర్వశివో రాక్షసివో’ మరచిపోలేని అనుభూతి.

ఈ హిట్‌ ఇచ్చిన రాకేష్‌ శశికి కృతజ్ఞతలు. శిరీష్‌తో హిట్‌ కొట్టిన మా నాన్నకి కంగ్రాట్స్‌. ఈ చిత్రంలో శిరీష్‌ నటన బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా తనని మరో మెట్టు ఎక్కించింది. ‘పుష్ప 1’ తగ్గేదే లే.. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే. ఈ సినిమా పాజిటివ్‌గా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ–‘‘ఐకాన్‌స్టార్‌గా ఆల్‌ ఇండియా స్థాయికి వెళ్లిపోయిన మన బన్నీ(అల్లు అర్జున్‌). ఇప్పుడిప్పుడు సక్సెస్‌ చూస్తూ స్టార్‌గా ఎదుగుతున్న మన శిరీష్‌. వాళ్లిద్దరూ ఇక్కడ ఉంటే నాకంటే ఆనంద పడేవారు ఎవరుంటారు.

‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘20 ఏళ్ల క్రితం ‘ఆర్య’ సినిమాతో నేను, సుకుమార్, బన్నీ కలిసి ప్రయాణం స్టార్ట్‌ చేశాం. ఈ రోజు మేము, మా సంస్థ పాన్‌ ఇండియా స్థాయికి వెళ్లిపోయాం. ‘ఆర్య’ చేసేందుకు ముఖ్య కారణం అల్లు అరవింద్‌గారు. ‘ఊర్వశివో రాక్షసివో’తో మంచి సక్సెస్‌ అƇదుకున్న టీమ్‌కి అభినందనలు. శిరీష్‌తో నేను ఓ సినిమా చేయాలి.. త్వరలో చేసి, తన బాకీ తీర్చేస్తాను’’ అన్నారు. ‘‘ఊర్వశివో రాక్షసివో’ ప్రయాణంలో నాకు సపోర్ట్‌ చే సిన అరవింద్, బన్నీవాస్‌గార్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.

ఇంత మంచి హిట్‌ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర నిర్మాత ధీరజ్‌ మొగిలినేని. ‘‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా సక్సెస్‌ని అల్లు శిరీష్‌గారిని అభిమానించే వారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు రాకేష్‌ శశి. ‘‘అరవింద్‌గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్ని అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు.. తన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం’’ అన్నారు శిరీష్‌.   ఈ వేడుకలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ఎస్‌కేఎన్, నటుడు సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు