ఎఫ్‌3 సెట్‌లో అల్లు అర్జున్‌ సందడి.. ఫోటోలు వైరల్‌

6 Oct, 2021 12:42 IST|Sakshi

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమా రాబోతోంది. ఒరిజిన‌ల్ చిత్రంతో పోలిస్తే ఎఫ్ 3 ప్రేక్ష‌కుల‌ని పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తుంద‌ని అంటున్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. తాజాగా ఎప్‌3 సెట్‌ని సందర్శించాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా, స‌డెన్‌గా సెట్‌లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌తో పాటు ప‌లువురు స్టార్స్‌తో క‌లిసి కాసేపు ముచ్చ‌టించాడు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. త‌మ‌న్నా, మెహ‌రీన్, సునీల్ ,రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.


 

మరిన్ని వార్తలు