బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్‌

8 Mar, 2021 10:41 IST|Sakshi

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, స్టైలింగ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కలిసి 'పుష్ప' అనే పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ క్యూటీ రష్మిక మందన్నా బన్నీతో జోడీ కడుతోంది. అయితే మొదట్లో ఈ చిత్రంలో రష్మికను కాకుండా అచ్చమైన తెలుగమ్మాయినే తీసుకోవాలనుకున్నారట. అల్లు అర్జున్‌ కూడా తెలుగు హీరోయినే కావాలని పట్టుబడ్డాడట. కానీ కొన్ని కారణాల రీత్యా రష్మికనే తీసుకున్నామని చెప్పుకొచ్చాడు సుకుమార్‌. ఈ క్రియేటివ్‌ డైరెక్టర్‌ స్నేహితుడు హరిప్రసాద్‌ జక్కా నిర్మించిన ప్లేబ్యాక్‌ సినిమా ఇటీవలే రిలీజై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో చిత్రయూనిట్‌ సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. దీనికి సుకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్లేబ్యాక్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనన్యపై ప్రశంసలు కురిపించాడు.

"అనన్య చాలా సహజంగా నటించింది. అయితే తెలుగు రాని హీరోయిన్లను పెట్టుకుంటే వారితో డైలాగులు చెప్పించడం కొంత కష్టం. అందుకే నా సినిమాల్లో ఎక్కువగా తెలుగు వచ్చినవాళ్లనే పెట్టుకున్నా. రంగస్థలంలో సమంత, ప్రకాశ్‌రాజ్‌ తప్ప అందరూ తెలుగువాళ్లే. కానీ వీళ్లిద్దరు కూడా తెలుగులో డైలాగ్స్‌ ఈజీగా చెప్పేవారు. నా తర్వాతి సినిమాలో తప్పకుండా తెలుగమ్మాయినే హీరోయిన్‌గా పెట్టుకుంటాను. ఇది నా ప్రామిస్‌. పుష్ప సినిమాలో తెలుగమ్మాయిని పెట్టమని బన్నీ చెప్పాడు. అంత పెద్ద హీరో ఈ మాట చెప్పడం సాధారణ విషయం కాదు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వచ్చిన రష్మికను పెట్టుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఎన్టీఆర్ ధరించిన మాస్క్‌ ధరెంతో తెలుసా?

తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి! : ఇర్ఫాన్‌ పఠాన్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు