ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.. చిరు ఎమోషనల్‌ ట్వీట్‌

31 Jul, 2021 15:22 IST|Sakshi

కామెడీతోనే కాదు విలనిజం కూడా చూపించి ఆకట్టుకున్న గొప్ప నటుడు అల్లు రామలింగయ్య. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వు ఆగదు. అప్పట్లో అల్లు రామలింగయ్య నటిస్తే చాలు ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉండేది. అంతాల తన కామెడీ టైమింగ్‌తో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించాడు. నేడు(జూలై 31) అల్లు రామలింగయ్య వర్ధంతి.  ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. చిత్ర పరిశ్రమకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి.ఒక డాక్టర్ గా,యాక్టర్ గా, ఫిలాసఫర్ గా,ఓ అద్భుతమైన మనిషిగా,నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ ..’అంటూ గతంలో అల్లు రామలింగయ్య ఫోటోకి నివాళులర్పిస్తున్న ఫోటోలను ట్విటర్‌ ద్వారా షేర్‌ చేశాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు