అల్లు శిరీష్‌ కొత్త చిత్రం 'Prema కాదంట'

30 May, 2021 12:14 IST|Sakshi

సరైన హిట్టు దొరక్కపోతే హీరోలు కొత్త ట్రాక్‌ ఎక్కుతారు. లేదంటే ప్రేక్షకుల నాడి తెలుసుకుని వారికి నచ్చేరీతిలో సినిమాలు చేసి మళ్లీ సక్సెస్‌ను రుచి చూస్తుంటారు. తాజాగా తెలుగు హీరో అల్లు శిరీష్‌ ఒకేసారి ఈ రెండు ఫార్ములాలను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పెద్దగా రొమాన్స్‌ జోలికి పోని శిరీష్‌ ఈ సినిమాలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇక ఈ మధ్య ప్రేమ కథాచిత్రాలు బాగా క్లిక్‌ అవుతుండటంతో పూర్తిగా లవ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమాలో తన లుక్‌ను కూడా ఇదివరకే రిలీజ్‌ చేశారు. ఈ మధ్యే సిక్స్‌ప్యాక్‌తో అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన ఈ హీరో తన సినిమాకు సంబంధించి వరుస ప్రీ లుక్‌లు రిలీజ్‌ చేస్తూ జనాలను ఆకర్షించాడు. నేడు(మే 30) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని చిత్రయూనిట్‌ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు "Prema కాదంట" అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అద్దం ముందు ఫొటోలు దిగుతున్న అను ఇమ్మాన్యుయేల్‌ మీద హీరో ముద్దుల వర్షం కురిపిస్తున్న ఫస్ట్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అను, శిరీష్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి టైటిల్‌తోనే వీరిది ప్రేమ కాదని చెప్పేసారా? ఏంటి? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

చదవండి: ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్‌.. అస్సలు తగ్గట్లేదుగా

మరిన్ని వార్తలు