హీరోయిన్‌కు అల్లు శిరీష్‌ స్పెషల్‌ గిఫ్ట్‌, స్పెషలేంటో?

7 May, 2021 11:03 IST|Sakshi

అల్లు వారబ్బాయి అల్లు శిరీష్‌ 2013లో ఇండస్ర్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి రూమర్స్‌ లేవు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్‌ అను ఇమాన్యుయేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేస్తూ ఇద్దరూ కలిసి కాఫీ షాపులు, పార్టీలు అంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే శిరీష్‌..ఇమాన్యుయేల్‌తో ఇంత క్లోజ్‌గా మూవ్‌ అవ్వడంతో వీరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ ఉందంటూ ప్రచారం సాగుతోంది.

ఇక ఇటీవలె అను ఇమాన్యుయేల్‌ బర్త్‌డే సందర్భంగా అల్లు శిరీష్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ అల్లు శిరీష్‌ స్పెషల్‌ విషెస్‌ చెప్పారు. ఇప్పడు మరోసారి వీరిద్దరి టాపిక్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ప్రయసిగా ప్రచారంలో ఉన్న అను ఇమాన్యుయేల్‌కు అల్లు శిరీష్‌ ప్రత్యేకంగా గిఫ్ట్‌ పంపారు. ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ టీషర్ట్‌పై ప్రింట్‌ చేయించి అను ఇమాన్యుయేల్‌కు పంపాడు. దీనిపై స్పందించిన ఈ భామ..సైకో అని ఉన్నా దీన్ని క్లాంపిమెంట్‌గానే తీసుకుంటానని చెబుతూ అల్లు శిరీష్‌ని వియర్డో అంటూ సంభాషించింది.

దీన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేసిన శిరీష్‌..వియర్డోనా...మనలో చాలా కామన్‌ విషయాలు ఉన్నాయి అంటూ స్వీట్‌గా ఈ భామపై సెటైర్‌ వేశారు. అంతేకాకుండా ఎనీవే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ షేర్‌ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్‌-అను ఇమాన్యుయేల్‌ మధ్య జరిగిన ఈ చాట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌గా మారింది. శిరీష్‌ తన పోస్టులో మై  ఫేవరెట్‌...అంటూ గ్యాప్‌ ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇంత క్లోజ్‌గా నిక్‌ నేమ్స్‌ కూడా పెట్టుకున్నారని నెట్టింట ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటిదాకా శిరీష్‌ స్పందించలేదు. 

చదవండి: కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న అల్లు శిరీష్‌!
తమ్ముడికి కంగ్రాట్స్‌ చెప్పిన అల్లు అర్జున్‌.. కారణం ఇదే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు