గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి

27 Jul, 2020 18:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి ఈ చాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె.. నేడు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అయాన్‌, అర్హలు మొక్కలకు నీళ్లు పోశారు. (వాళ్లిద్దరూ డిశ్చార్జ్‌ అయ్యారు : అభిషేక్‌)

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ చాలెంజ్‌కు తనను నామినేట్‌ చేసినందుకు సుష్మితకు థ్యాంక్స్‌ చెప్పారు. తదుపరి ఈ చాలెంజ్‌కు తన భర్త అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరిని నామినేట్‌ చేశారు. (బిగ్‌బాస్‌ ఎంట్రీపై శ్రద్ధా దాస్‌ క్లారిటీ)

Thanks @sushmitakonidela for nominating me :) #greenindiachallenge #harahaitohbharahai I nominate @alluarjunonline @rsingareddy @meghanajrao

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా