అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా

14 Apr, 2021 13:47 IST|Sakshi

అల్లు అర్జున్‌ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అందరికి తెలిసిందే. షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే బన్నీ.. కొంచెం సమయం దొరికినా చాలు ఇంటి ముందు వాలిపోతాడు. భార్య, పిల్లలతోనే తన విరామ సమయాన్ని గడుపుతాడు. ఇక బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటోంది. బన్నీ, పిల్లలకు సంబంధిన ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇటీవల మాల్దీవులకు వెళ్లిన ఈ ఫ్యామిలీ.. అక్కడ ఎంత సందడి చేశారో తెలిసిందే. అక్కడ బన్నీ, అయాన్‌, అర్హ చేసిన అల్లరిని  అంతా అభిమానులతో పంచుకుంది స్నేహారెడ్డి. అలా స్నేహరెడ్డి  షేర్‌ చేసిన ఫోటోలు, వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా స్నేహారెడ్డి తన ఐడియాతో చేసిన ఓ ఫోటోషూట్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. స్నేహారెడ్డి ఐడియాకి బన్నీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ ఫోటో షూట్‌లో ఏముందంటే.. అల్లు అర్జున్‌, స్నేహా కలిసి ఓ స్కూటీపై తమ తొలి పరిచయం నుంచి ఇద్దరు పిల్లలు పుట్టే వరకు ఒకే ఫోజులో ఫోటో దిగారు. మొదటి ఫోటోలో అల్లు అర్జున్‌, స్నేహ మాత్రమే ఉండగా, రెండో ఫోటోలో అయాన్ చేరాడు. ఇ​క మూడో ఫోటోలో ఈ ముగ్గురికి అర్హ తోడైంది. నాలుగోదాంట్లో లేటెస్ట్‌గా దిగిన ఫోటో ఉంది. ఒకే లొకేషన్‌, ఒకే ఫోజులో దిగడం ఈ ఫోటోషూట్‌ విశేషం. ఈ ఫోటోలు స్నేహా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అల్లువారి కోడలు ఐడియాకి అక్కినేని కోడలు సమంత కూడా ఫిదా అయింది.  క్యూట్‌ అంటూ కామెంట్‌ చేసింది. 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు