అల్లుడు షూటింగ్‌ షురూ

22 Sep, 2020 02:32 IST|Sakshi
బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో సోమవారం పునఃప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాష్‌ రాజ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గొర్రెల మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ‘అల్లుడు అదుర్స్‌’ టైటిల్‌కు, ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా కె. నాయుడు, సమర్పణ: రమేష్‌కుమార్‌ గంజి.

మరిన్ని వార్తలు