సంక్రాంతికి మంచి వినోదం ఇస్తాం

31 Dec, 2020 06:21 IST|Sakshi
మోనాల్, సోనూ సూద్, సుబ్రహ్మణ్యం, సాయి శ్రీనివాస్, నభా నటేశ్, సంతోష్‌ శ్రీనివాస్‌

– బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక తారాగణం పాల్గొనగా డ్యాన్స్‌ మాస్టర్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ ప్రత్యేక పాటలో మోనాల్‌ గజ్జర్‌ నర్తిస్తున్నారు. సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘అల్లుడు శ్రీను’ తర్వాత నేను చేస్తున్న కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అల్లుడు అదుర్స్‌’. సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులందరినీ వినోదంతో అలరిస్తుంది’’ అన్నారు.

‘‘ఫుల్‌ ఫన్‌తో మా సినిమా విందుభోజనంలా ఉంటుంది’’ అన్నారు సంతోష్‌ శ్రీనివాస్‌. ‘‘నిర్మాత బెల్లంకొండ సురేశ్‌గారు చాలా సపోర్ట్‌ చేశారు. మా సినిమాతో పాటు విడుదలయ్యే అన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు సోనూ సూద్‌. ‘‘దాదాపు ఐదేళ్ల తర్వాత నేను పెర్ఫామ్‌ చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు మోనాల్‌ గజ్జర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు