పసిబిడ్డతో సహా ఫ్యామిలీకి కరోనా, నటుడి భావోద్వేగం

4 May, 2021 20:22 IST|Sakshi

‘మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా పాజిటివ్‌గా పరీక్షించినట్లైయితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పడు నాకు తెలుస్తోంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు నటుడు, హిందీ బిగ్‌బాస్‌ 14 కంటెస్టెంట్‌ అలీ గోని. హిందీలో పలు సీరియల్స్‌తో పాటు మోడల్‌గా రాణిస్తున్న అలీ గోని మంగళవారం ట్వీట్‌ చేస్తూ.. గత తొమ్మిది రోజులుగా తన కుటుంబ సభ్యులు ఒక్కక్కరిగా మహమ్మారి బారిన పడుతున్నట్లు తాజాగా వెల్లడించాడు.

తన తల్లి, సోదరితో పాటు ఆమె పిల్లలు కూడా ఈ వైరస్‌తో బారిన పడ్డారని, ముఖ్యంగా తమ పసిబిడ్డ సైతం కోవిడ్‌తో పోరాడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించాడు. ఇక తామంత త్వరలోనే కరోనా నుంచి కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అయితే గత శుక్రవారం అలీ గోనికి కరోనా పాజిటివ్‌గా తెలినట్లు  సోషల్‌ మీడియా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం బాగానే ఉందని, మీలో ఎవరికైనా లక్షణాలు ఉంటే తమని తాము పరీక్షించుకోవాలన్నాడు. సెల్ఫ్‌ క్వారంటైన్‌కి వెళ్లి మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ దేశవ్యాప్తంగా కొరలుచాస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది మహమ్మారి మరింత ప్రభావం చూపేడుతోంది. రోజురోజుకు కోవిడ్‌-19 బారిన పడుతున్న వారి సంఖ్య రెట్టింపవుతోంది. దీంతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటడంతో ఆస్పత్రుల్లో సమయానికి వైద్యం అందక, దానికి తోడు ఆక్సీజన్‌ కొరత ఉండటంతో ప్రజలు మృత్యువాత పడున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు