పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటా: నటుడు

22 Feb, 2021 15:17 IST|Sakshi

హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే ఆదివారం(ఫిబ్రవరి 21) అంగరంగా వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాహుల్‌ వైద్యను వెనక్కు నెట్టి రుబీనా దిలైక్‌ విజేతగా అవతరించింది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది. తన కలను నిజం చేసిన అభిమానులకు ఆమె వేవేల కృతజ్ఞతలు తెలిపింది. రాఖీ సావంత్‌, నిక్కీ తంబోళిలతో పాటు టాప్‌ 5లోకి అడుగుపెట్టిన అలీ గొని మూడో రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అతడికి ఎక్కడికి వెళ్లినా పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురవుతోంది.

ఈ క్రమంలో తన పెళ్లి గురించి అలీ స్పందిస్తూ.. "అసలు నేను బిగ్‌బాస్‌ షోకు వెళ్లిందే నా స్నేహితురాలు జాస్మిన్‌ను ఎంకరేజ్‌ చేసేందుకు. కానీ అక్కడకు వెళ్లాక అర్థమైంది ఆమె పూర్తిగా నా మనిషి అని, నా కోసమే పుట్టిందని! ఆ విషయం అర్థమయ్యాక ఆమెతో టైమ్‌ స్పెండ్‌ చేసేందుకు మరీమరీ ఎదురు చూస్తున్నా. అంతా కలిసొస్తే తనను తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అలా అని ఆమెను ఇప్పుడప్పుడే వివాహానికి తొందర పెట్టను. కానీ భవిష్యత్తులో మాత్రం జాస్మిన్‌ తల్లిదండ్రులను ఎలాగైనా ఒప్పించి మరీ ఆమెను నాదాన్ని చేసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు. మూడేళ్లుగా స్నేహగీతం పాడిన ఈ ఇద్దరూ ఎట్టకేలకు పెళ్లికి రెడీ అవుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ విన్నర్‌గా‌ రుబీనా, ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు