బాలీవుడ్‌కి స్పెషల్‌గా...

3 Nov, 2022 04:10 IST|Sakshi

కథానాయిక అయిన పదేళ్లకు అమలా పాల్‌ ఇప్పుడు హిందీ తెరకు పరిచయం కానున్నారు. అది కూడా స్పెషల్‌గా... అంటే స్పెషల్‌ రోల్‌లో అన్నమాట. అజయ్‌ దేవగన్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘భోలా’లోనే ఆమె ప్రత్యేక పాత్ర చేయనున్నారు. కార్తీ హీరోగా నటించిన హిట్‌ తమిళ మూవీ ‘ఖైదీ’కి ‘భోలా’ హిందీ రీమేక్‌.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను టబు చేస్తున్నారు. తాజాగా అమలా పాల్‌ని ఎంపిక చేసిన విషయాన్ని చిత్రబృందం బుధవారం ప్రకటించింది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్‌లో ఆరంభం కానున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌లో అమలా పాల్‌ పాల్గొంటారు.

మరిన్ని వార్తలు