సీరియల్‌ చిల్లర్‌

7 Dec, 2020 05:59 IST|Sakshi

‘సీరియల్‌ కిల్లర్‌’ అని విన్నాం కానీ ‘సీరియల్‌ చిల్లర్‌’ అని వినలేదే అనుకుంటున్నారా? అమలా పాల్‌ తనని తాను ఇలా అనుకుంటున్నారు. ‘ఉన్నది ఒక్కటే జీవితం. ఆస్వాదించాలి’ అంటుంటారు అమలా పాల్‌. అందుకే పని ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అయిపోవడానికి అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్‌లు ప్లాన్‌ చేసుకుంటారు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. కొన్నిసార్లు స్నేహితులతో కలసి ‘చిల్‌’ అవ్వడానికి ట్రిప్‌లు వెళుతుంటారు. ఇప్పుడు గోవాలో ఉన్నారు అమలా పాల్‌. ఫుల్‌గా రిలాక్స్‌ అవుతున్నారు. స్నేహితులతో కలసి చిల్‌ అవుతున్నారు. గోవాలో చిల్‌ అవుతున్న ఫొటోలను షేర్‌ చేసి, ‘మా హౌస్‌లో నేనే సీరియల్‌ చిల్లర్‌ని’ అని క్యాప్షన్‌ చేశారు. ఇలా వీలు కుదిరినప్పుడల్లా చిల్‌ అవ్వడానికి ఎక్కడో చోటకు వెళుతుంటారు కాబట్టే తనని తాను ‘సీరియల్‌ చిల్లర్‌’ అని ఉంటారామె.

మరిన్ని వార్తలు