నటి అమలాపాల్‌కు అరుదైన గౌరవం..

30 Dec, 2021 07:28 IST|Sakshi

Amala Paul Get Golden Visa: నటి అమలాపాల్‌ దుబాయ్‌ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా అందుకున్నారు. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ అమ్మడు అని చెప్పవచ్చు. ఇటీవల ఈమె హవా కాస్త తగ్గింది. అయితే  వెబ్‌ సిరీస్‌లతో బిజీగానే ఉన్నారు. కాగా, తాజాగా దుబాయ్‌ ప్రభుత్వం  అమలాపాల్‌కు గోల్డెన్‌ వీసాను ఇవ్వడం విశేషం. దీని గురించి ఆమె పేర్కొంటూ ఇలాంటి అరుదైన గౌరవం లభించడం సంతోషంగా, భాగ్యంగానూ భావిస్తున్నానన్నారు. అది ఇది అందం, ఆడంబరాలకు నిలయమైన దేశం మాత్రమే కాదనీ, అక్కడి ప్రజలు ప్రతి ఒక్కరూ నిజాయితీగా లక్ష్యంతో పని చేస్తారని పేర్కొన్నారు.  

చదవండి: (నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమా ఇది)

మరిన్ని వార్తలు